
స్పోర్ట్స్ స్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన చైర్మన్ శివసేనారెడ్డి
సి కే న్యూస్ ప్రతినిధి హకీంపేట : హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. వంటగది డైనింగ్ హాల్ విద్యార్థుల బెడ్ రూమ్ పాఠశాల తరగతి గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన చైర్మన్ శివసేన రెడ్డి. ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాల్సిన భోజనాన్ని అందించాలని, పరిశుభ్రతకు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. నూతనంగా హనుమకొండలో క్రీడా పాఠశాల ఏర్పాటు చేయడమే కాకుండా గచ్చిబౌలి స్టేడియంలో మరియు ఎల్బీ స్టేడియంలో నూతనంగా క్రీడా అకాడమీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు క్రీడాంశాల్లో నూతన అకాడమీలో ఏర్పాటు చేస్తూరాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడల ద్వారానే భావి సమాజం నిర్మించాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు అధికారులు కోచులు సిబ్బంది పని చేయాలని , విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించమని, అన్ని అకాడమీ లను పాఠశాలను తరచుగా ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఎవరైనా విధుల్లో అ లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ ఓ ఎస్ డి మమత, కోచులు, టీచర్లు పాల్గొన్నారు




