
ప్లాట్ ఫామ్ 65 హోటల్ కిచెన్ లో ఎలుకలు, డ్రైనేజిలో ఫుడ్ ఐటమ్స్…
web desc : హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యత, శుభ్రతపై ఫోకస్ పెట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు దూకుడు పెంచారు. సిటీలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై వరుస తనిఖీలు చేస్తున్నారు అధికారులు.
ఈ క్రమంలో కూకట్ పల్లి జోనల్ పరిధిలోని ప్లాట్ఫామ్ 65 హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బుధవారం ( జూన్ 24 ) నిర్వహించిన ఈ తనిఖీల్లో హోటల్ కిచెన్ ప్రాంగణంలో ఎలుకలు సంచరిస్తుండటం, డ్రైనేజీలు ఆహార వ్యర్థాలతో పూడుకుపోవడాన్ని అధికారులు గుర్తించారు అధికారులు.
ఫ్రీజర్లలో పాచిపోయిన ఆహారాన్ని నిల్వ ఉంచడమే కాకుండా, వెజ్, నాన్-వెజ్ పదార్థాలను ఒకేచోట మూతలు లేకుండా ఉంచినట్లు తేల్చారు.కనీస పరిశుభ్రత పాటించని ఈ హోటల్‌కు హైజీన్ రేటింగ్‌లో 110 మార్కులకు గానూ కేవలం 40 మార్కులు (37%) మాత్రమే వచ్చాయి.
నిబంధనల ప్రకారం 50శాతం కంటే తక్కువ మార్కులు రావడంతో.. సదరు హోటల్‌కు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే హోటల్ ఆహార భద్రత లైసెన్స్ ను తక్షణమే రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.





