MedakPoliticalTelangana

యూరియా కోసం చిన్నఘనాపూర్ రైతుల అవస్థలు

యూరియా కోసం చిన్నఘనాపూర్ రైతుల అవస్థలు

యూరియా కోసం చిన్నఘనాపూర్ రైతుల అవస్థలు

సొసైటీకి ఇప్పటికీ చేరని ఎరువులు

అన్నిపంటలకు అనువైనడీ. ఎరువులు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

సి కే న్యూస్ కొల్చారం నర్సాపూర్

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని చిన్నఘనాపూర్ ప్రాథమిక
వ్యవసాయ సహకార సంఘంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సాగు పనులు ఊపందుకున్న సమయంలో యూరియా లేక రైతులు పొరుగు గ్రామాలకు వెళ్లి ఎరువుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇతర ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు యూరియా సరఫరా జరుగుతుండగా, చిన్నఘనాపూర్ సొసైటీకి మాత్రం ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.

ఇది సొసైటీ పాలకవర్గం నిర్లక్ష్యమా, లేక వ్యవసాయ శాఖ అధికారుల వైఫల్యమా అని ప్రశ్నిస్తున్నారు. పంటల ఎదుగుదల దశలో యూరియా అత్యవసరమని, సమయానికి ఎరువులు అందకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చిన్నఘనాపూర్ సొసైటీకి యూరియా సరఫరా చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

డిసిఓ పద్మ వివరణ… రైతులకు ఇబ్బంది కలగకుండా మార్క్ పెడ్ డి ఎం తో మాట్లాడడం జరిగింది నేటి సాయంత్రం వరకు చిన్న ఘనపూర్ సొసైటీకి యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని డిసిఓ పద్మ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button