
బాధిత కుటుంబానికి అండగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్
బియ్యం, నూనెతో పాటు నగదు సహాయం అందజేత
బీఆర్ఎస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో రూ.10,500 ఆర్థిక సాయం
పాలకుర్తి/రాయపర్తి,ck న్యూస్ ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలయాపల్లి గ్రామానికి చెందిన అన్నెపు అనిల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, వారి కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్‌ను అందజేసి అండగా నిలిచారు.
కష్టకాలంలో బాధిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ.10,500 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మం డల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, స్థానిక సర్పంచ్ బరిగేలా బాబు, పార్టీ నాయకులు వశపాక మారయ్య, దోకుడు దేవేందర్, యుగేందర్ రెడ్డి, గుడి మైబు రెడ్డి, గజావెల్లి రాజు, దొంతరాబోయిన యాదగిరి, వశపాక కుమార్, సుధాగాని ప్రదీప్, సొమెందర్, పల్లె యాకయ్య, డొంక మధుకర్, గజావెల్లి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.




