
రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ఐదు ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం
దేవరుప్పుల మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యక్రమం
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నాయకులు
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఆదేశాలతో నిర్వహణ
పాలకుర్తి/దేవరుప్పుల,(ck న్యూస్) ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయడంపై దేవరుప్పుల మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసిన సందర్భంగా మంగళవారం జనగామ–సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల సంక్షేమం కొరకే పార్టీ కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కాసారపు ధర్మారెడ్డి, తోటకూరి పాండు కృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్యా సజ్జన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనుముల నాగరాజు, బీసీ సెల్ అధ్యక్షుడు కాడబోయిన గణేష్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ గులాం రసూల్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




