PoliticalTelanganaWarangal

వరంగల్ పోలీస్ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

వరంగల్ పోలీస్ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

వరంగల్ పోలీస్ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

పాలకుర్తి,(ck న్యూస్) ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ అధికారి ఎన్. శ్వేతా రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు చేపట్టే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన శాంతిభద్రతల అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖ సహకారం కొనసాగాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా రెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button