
అక్రమంగా వధశాలలకు కోడె దూడలను తరలిస్తున్న ముఠా అరెస్ట్
9 చిన్న ఎడ్లు, 5 కిలోల మాంసం స్వాధీనం – వాహనం సీజ్
జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవు – టూ టౌన్ సీఐ కె. నాగరాజు
జంతువులను అక్రమంగా వధశాలలకు తరలిస్తూ చట్టాలను ఉల్లంఘించే వారిపై ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు హెచ్చరించారు.
గత రాత్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన ప్రత్యేక వాహన తనిఖీలలో ఒక అనుమానాస్పద వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో 9 చిన్న ఎడ్లను అమానుషంగా తాళ్లతో కట్టి వధశాలలకు తరలిస్తున్న ముఠా పట్టుబడింది. తనిఖీలో 5 కిలోల మాంసం కూడా స్వాధీనం చేసుకుని, ఎడ్లను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. విచారణలో నిందితులు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన వారిగా గుర్తించారు.
ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు, వెటర్నరీ వైద్యుడి ఆరోగ్య ధ్రువీకరణ పత్రం లేకుండానే జంతువులను అక్రమంగా తరలిస్తున్నట్లు, అలాగే కొనుగోలుకు సంబంధించిన పత్రాలు కూడా లేవని పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న 9 చిన్న ఎడ్లను గోశాలకు తరలించి సంరక్షణకు అప్పగించారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిందితుల వివరాలు:
A1) అబ్దుల్ జహీర్ (29), తండ్రి: అబ్దుల్ ఖాదీర్, ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా.
A2) అబ్దుల్ నజీర్ (40), తండ్రి: అబ్దుల్ ఖాదీర్, ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా.
A3) అబ్దుల్ రఫీక్ (29), తండ్రి: అబ్దుల్ ఖాదీర్, ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా.
A4) అబ్దుల్ బషీర్ @ బషీర్ ఖురేషి (32), తండ్రి: అబ్దుల్ ఖాదీర్, ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా.
జంతువులను అక్రమంగా రవాణా చేయడం, వధించడం, మాంసం అక్రమ వ్యాపారం నిర్వహించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందని, ఇటువంటి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని టూ టౌన్ సీఐ కె. నాగరాజు విజ్ఞప్తి చేశారు.




