HyderabadPoliticalTelangana

'బతుకు జట్కా బండి'కి తీసుకెళ్తామని నమ్మించి అత్యాచారం

'బతుకు జట్కా బండి'కి తీసుకెళ్తామని నమ్మించి అత్యాచారం

‘బతుకు జట్కా బండి’కి తీసుకెళ్తామని నమ్మించి అత్యాచారం

web desc : కుటుంబ సమస్యల పరిష్కారం కోసం నగరానికి వచ్చిన ఓ మహిళను టీవీ ప్రోగ్రామ్​కు తీసుకెళ్తామని నమ్మించి ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. వరకట్న వేధింపుల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న మహిళ తన కొడుకుతో కలిసి జీవిస్తోంది. కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ప్రముఖ టీవీ కార్యక్రమం ‘బతుకు జట్కా బండి’లో పాల్గొనాలని నిర్ణయించుకుని నగరానికి వచ్చింది. పంజాగుట్టలో కార్యక్రమ కార్యాలయం కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.

ఈ సమయంలో పరిచయమైన ఓ వ్యక్తి, తాను కార్యక్రమ నిర్వాహకుల వద్దకు తీసుకెళ్తానని నమ్మబలికాడు. అనంతరం ఆమెను రాణిగంజ్‌లోని హైదరీ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లి, అక్కడ మరో వ్యక్తితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు మహంకాళి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు, ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button