Bhadradri KottagudemPoliticalTelangana

రాజకీయ జగడాలు కాదు.. సాగు జలాలు ఇవ్వాలి: సాంబశివరావు

రాజకీయ జగడాలు కాదు.. సాగు జలాలు ఇవ్వాలి: సాంబశివరావు

రాజకీయ జగడాలు కాదు.. సాగు జలాలు ఇవ్వాలి: సాంబశివరావు

రాష్ట్రంలో రాజకీయ దిగడాలు మాని సాగు జలాలను అందించేందుకు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సీపీఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తి ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సిపిఐ ఉమ్మడి జిల్లా మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి రిజర్వాయర్ నింపి నీళ్లు ఇవ్వాలని హరీష్ రావు, కేటీఆర్, నింపితే తెగి కొట్టుకుపోయి నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని దీనిపై నీచ రాజకీయాలు, బూతు పురాణం సరికాదని, సంయమనం పాటించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ వ్యాఖ్యలను తీరును సిపిఐ ఖండిస్తోందన్నారు. మూడేళ్ల క్రితం కాలేశ్వరం పిల్లర్లు కుంగుబాటుపై మూడేళ్ల క్రితం నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ పరిశీలించి సిడబ్ల్యుసికి నివేదిక పంపిన ఇంతవరకు సిడబ్ల్యుసి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. కాలేశ్వరం విషయంలో రాజకీయ నిర్ణయాలు సరికాదని సిడబ్ల్యుసి నివేదిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్రం తెలంగాణ ఏ ప్రాజెక్టుకు ఇంతవరకుజాతీయ హోదా ఇవ్వలేదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రకు పోలవరం కు జాతీయ హోదా కల్పించినందుకు తెలంగాణ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తేనే సమన్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు సాగునీరు అందుతుందన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల కెఎల్ఐ నెట్టెంపాడు బీమా కోయిల్ సాగర్ తదితర ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయని ఐదు ఆరు లక్షల కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. భారత గడ్డపై సిపిఐ కి వందేళ్లు దాటిందనా ప్రజల పక్షాన నిటారుగా నిలబడి రాజీలేని పోరాటం చేస్తోందని, సమరశీల పోరాటాల ద్వారా ఎర్రజెండా మరింత ఎరుపెక్కిందన్నారు. కమ్యూనిస్టు పార్టీపై కారుకూతలు కూసేవారు ఒక్కరోజైనా కమ్యూనిస్టుగా బతికితే దాని మాధుర్యం తెలుస్తుందని, మనిషి మనిగడ కోసమే పుట్టిన సిద్ధాంతం కమ్యూనిజం అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎర్రజెండా పోరాట చాయలు ఉంటాయని దోపిడీ రహిత పేదల రాజ్యం స్థాపించడమే ఎర్రజెండా లక్ష్యమన్నారు. రాజకీయ శిక్షణ తరగతులు పార్టీకి జీవం లాంటివని తాజా రాజకీయ అంశాలతో పాటు సిద్ధాంతాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంధితగా పయనిస్తుందని దాన్ని దాచి పెట్టేందుకే నరేంద్ర మోడీ పొదుపు మంత్రం పటిస్తున్నారన్నారు. హిందుత్వ ఎజెండాతో ఓట్ల లబ్ది పొందేందుకు, రాజ్యాంగ వ్యవస్థను తుంగలో తొక్కినందుకు రాజ్యాంగ పీడికకు బిజెపి ఉరితాళ్లు పేనుతోందన్నారు. దేశ సంపద కొందరి చేతిలో కేంద్రీకృతమయ్యే విధానాలను అనుసరిస్తుందని, పేదల సంక్షేమ పథకాలను ఉచితాల పేరుతో ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని, అలాంటప్పుడు కార్పొరేట్లకు బహుళ జాతి కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఉచితపథకాలపై విష ప్రచారం చేస్తున్న కేంద్రం, మౌన జాతి కంపెనీలకు ఇస్తున్న లక్షల కోట్ల రాయితీపై ఎందుకు ప్రచారం చేయటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, పేదల గుడిసెలను కూలిస్తే పాలకుల గుండెల్లో గుణపాలు దిగుతాయని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 9 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నామని సెప్టెంబర్ 1న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఢిల్లీలో భారీ ప్రజా ప్రదర్శన నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలన్నారు. ఈరోజు సిపిఐ నేత జితేందర్ రెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ విప్లవోద్యమ చరిత్ర అంశంపై తరగతులు బోధించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ, రాష్ట్ర సమితి సభ్యులు వార్ల వెంకటయ్య, కేశవులు గౌడ్, సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి విజయరాములు, నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి గద్వాల జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు నారాయణపేట జిల్లా కార్యదర్శి నరసింహులు వివిధ జిల్లాల నాయకులు రమేష్ సురేష్ శ్రీరామ్ మోష శ్రీహరి గోపాలకృష్ణ రాబర్ట్ భాస్కర్ అబ్రహం డంగు కుర్మయ్య రవీందర్ వంక గోపాల్ కాకం బాలస్వామి కృష్ణవేణి గీత శ్యామల చెన్నమ్మ లావణ్య కురుమ లక్ష్మి శ్రీ విద్యా పద్మావతి భార్గవి ఇందిరా సంతోష్ శ్రీను దేవానంద్ పెంటయ్య లక్ష్మీపతి నరసింహ శెట్టి లక్ష్మీనారాయణ శెట్టి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button