Andhra PradeshPolitical

కండక్టర్‌ని పొట్టుపొట్టు కొట్టిన మహిళలు!

కండక్టర్‌ని పొట్టుపొట్టు కొట్టిన మహిళలు!

కండక్టర్‌ని పొట్టుపొట్టు కొట్టిన మహిళలు!

Web desc : ఫ్రీబస్సు వచ్చిన తర్వాత ఎప్పుడూ చూడని ఘోరాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇంతకాలం సీట్ల కోసం మహిళలు తన్నుకున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. మగవారితో, కండక్టర్‌తో కొట్లాట చాలా తక్కువనే చెప్పొచ్చు.

బంధువులు వస్తున్నారు బస్సు ఆపాలని కొందరు మహిళలు అడగ్గా.. బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నారు.. వెనక వచ్చే బస్సుకు రమ్మని కండెక్టర్ చెప్పడంతో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గూడూరు డిపోనకు చెందిన పల్లె వెలుగు బస్సు, పొదలకూరు నుంచి గూడూరు వెళ్తోంది.

అందులో కండక్టర్‌గా హస్సేన్ ఉన్నారు. పొదలకూరు డిపో నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు ఊరులోని పంచాయతీ బస్టాండ్‌కు చేరుకుంది. ఆ సమయంలో అక్కడే బస్సు కోసం ఉన్న సైదాపురానికి చెందిన నలుగురు మహిళలు ఉన్నారు.

ఆ నలుగురు మహిళలు కూడా బస్సు ఎక్కేశారు. అయితే, బస్సు కదులుతున్న సమయంలో కాసేపు ఆపాలన్నారు. తమ బంధువులు వస్తున్నారని, కొద్ది సేపు ఆపాలంటూ కండక్టర్‌కు చెప్పారు. అప్పటికే 80 మంది ప్రయాణికులతో బస్సు ఫుల్లవడంతో మరో బస్సులో రావాలంటూ కండక్టర్ వారికి సూచించారు.

ఈ క్రమంలో కండక్టర్ – ఆ నలుగురు మహిళల మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ నలుగురు మహిళలు కండక్టర్‌పై దాడి చేశారు. చొక్కాలు చించి మరీ దాడి చేశారు.

ఈ దాడిలో కండక్టర్ మెడ భాగంలో గాయాలయ్యాయి. దాంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కండక్టర్ ఆ నలుగురు మహిళల మీద ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం కింద మహిళలు బస్సు ప్రయాణాల్లో ఉచితంగా వెళ్లొచ్చు.

ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడం, సీట్ల లేక ప్రయాణికులు ఇబ్బందులు పడటంతో గొడవలు కూడా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా కండక్టర్‌పై దాడి జరగడంతో ఆర్టీసీ వర్గాలు ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button