
సీకే న్యూస్ కి ఆరోగ్య ఆసుపత్రి నోటీసులు
వాస్తవాలను తుడిచిపెట్టమని బెదిరింపులు
ప్రజల గొంతు నొక్కేసే ప్రయత్నం
న్యాయస్థానంలో తేల్చుకోనున్న సీకే న్యూస్
నోటీసులు సీకే న్యూస్ కి కొత్త కాదు
నిజాల్ని నిర్భయంగా ప్రసారం చేసి ప్రజల గొంతుకై నిలిచిన సీకే న్యూస్ పై ఆరోగ్య అస్సుపత్రి యాజమాన్యం బెదిరింపులకు పాల్పదుతోంది. సదరు అస్స్పుపత్రిలో ఓ పెషంట్ మృతి కి సంభందించి ఉన్నదున్నట్టు బాధితుల గొంతు వినిపించింది. కథనంలో కట్టు కథలు లేవు, కాకమ్మ కథలు లేవు.
ఉన్నదున్నట్టు, ఆసుపత్రి వైఫల్యాలను, కళ్ళకు కట్టినట్టు బాధితుల కథనం ప్రసారం చేసినందుకు, ఆరోగ్య ఆసుపత్రి యాజమాన్యం సదరు వీడియోలు డిలిట్ చేయమని బెడిరింపులకు తెగబదుతోంది. పేదవాడి గొంతును డిలిట్ చేయకుంటే కోటి రూపాయల కు దావా వేస్తామని నొటీస్ పంపింది. సీకే న్యూస్ ఇలాంటి నొటిసులకు భయపడే సమస్యే లేదు. న్యాయవ్యవస్తపై మాకు నమ్మకం వుంది.
అనారోగ్య వ్యవస్థకు చికిత్స చేయదానికి సీకే న్యుస్ సిద్దంగా వుంది. న్యాయస్థానంలో తేల్చుకోదానికి సీకే న్యుస్ సిద్దంగానే వుంది.
“ఆ ఆసుపత్రి కి అసలు అండ ఎవరు? పేదల బతుకుతో చెలగాటం ఆదుతున్న ప్రజా ప్రతినిధి ఎవరు ? సీకే న్యుస్ ఇన్వెస్టిగేషన్ న్యూస్ త్వరలో…




