"సీకే న్యూస్‌పై పరువునష్టం కేసు నోటీసు.. నిజం కోసం మా పోరాటం కొనసాగుతుంది!" సీకే న్యూస్‌పై ఒక ప్రైవేట్ ఆసుపత్రి పరువునష్టం కేసుకు సంబంధించిన లీగల్ నోటీసు పంపింది. చట్టాన్ని గౌరవించే సంస్థగా ఆ నోటీసును మేము స్వీకరించాం. అందులోని అంశాలకు చట్టపరంగా తగిన సమాధానం ఇస్తాం.గత తొమ్మిది సంవత్సరాలుగా సీకే న్యూస్ ప్రజా సమస్యలను, ప్రజా ప్రయోజన అంశాలను వెలుగులోకి తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తూ వస్తోంది. మా లక్ష్యం ఎవరి ప్రతిష్ఠను దెబ్బతీయడం కాదు; ప్రజలకు సంబంధించిన అంశాలను బాధ్యతాయుతంగా అందించడం.ఏదైనా అంశంపై అభ్యంతరాలు ఉంటే వాటిని చట్టపరంగా పరిష్కరించుకోవడమే సరైన మార్గమని మేము విశ్వసిస్తున్నాం. అదే విధంగా ఈ విషయాన్ని కూడా చట్టపరంగానే ఎదుర్కొంటాం.సీకే న్యూస్ ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లేదా బెదిరింపులకు లోనుకాకుండా, చట్టాన్ని గౌరవిస్తూ, నిజానిజాలు వెలుగులోకి వచ్చేలా తన బాధ్యతను కొనసాగిస్తుంది.మాకు ఎప్పటిలాగే ప్రేక్షకుల విశ్వాసమే బలం. మీ ఆదరణతో మరింత బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా వార్తలను అందించేందుకు కట్టుబడి ఉంటాం.