
ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడి
శంషాబాద్ రూరల్ : ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ బుధవారం కేసు వివరాలు వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థలో క్యాబిన్ క్రూగా ఉద్యోగం చేస్తున్న బాధితురాలిని ప్రతిరోజు క్యాబ్ డ్రైవర్ ప్రశాంత్‌కుమార్ తీసుకుపోయేవాడు.
ఈనెల 20న మధ్యాహ్నం సమయంలో బాధితురాలిని శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లో తీసుకుపోతున్న ప్రశాంత్‌కుమార్ మొయిన్‌రోడ్డు బంద్ ఉందని చెప్పి ఎయిర్‌పోర్టులోని నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడినుంచి పారిపోయాడు.
తదనంతరం బాధితురాలు ఎయిర్‌పోర్టు అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు ప్రశాంత్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు ప్రస్తుతం శంషాబాద్‌లోని సిద్ధాంతికాలనీలో నివాసముంటుండగా.. అతడి స్వస్థలం వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రాంతంగా పోలీసులు తెలిపారు.




