
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
6, 7, 8 తరగతుల విద్యార్థుల ప్రవేశాలకు అవకాశం
ఈ నెల 27, 28 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ.. 30న ప్రవేశ పరీక్ష
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 25 2026: ఖమ్మం జిల్లా పరిధిలోని తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతుల్లో ఉన్న బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి పాఠశాల స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు టి.జి.ఆర్.ఎస్. & జె.సి. (బాలుర), ఏన్కూరు ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి ఈ నెల 27, 28 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష ఈ నెల 30న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా పరిధిలోని టి.జి.ఆర్.ఎస్. & జె.సి. (బాలుర), ఏన్కూరు పాఠశాలలో బాలురు, టి.జి.ఆర్.ఎస్. & జె.సి. (బాలికల), వైరా పాఠశాలలో బాలికలు నిర్ణీత తేదీలు, సమయాల్లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సంబంధిత గురుకుల విద్యాలయాలను సంప్రదించాలని ప్రధానోపాధ్యాయులు కోరారు.




