
కమ్యూనిస్టుల పోరాటాలు ఎప్పటికీ వృధా కావు….
అలవాల శ్రీనివాస్ 13వ వర్ధంతి సభలో..
సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి..
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి
కమ్యూనిస్టులు చేసే పోరాటాలు వారు చేసే ప్రాణ త్యాగాలు ఎప్పటికీ వృధా కావని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు తెలిపారు. మంగళవారం మండల పరిధిలో పందిళ్ళపల్లి గ్రామంలో 13 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గుండాలచే హత్య గావించబడిన కామ్రేడ్ అలవాల శ్రీనివాసరావు 13వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ అలవాల శ్రీనివాసరావు న్యాయవాది వృత్తి చేస్తూనే గ్రామంలో పార్టీ కార్యకలాపాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీ బలోపేతానికి ఎంతగానో తోడ్పాటునందించేవాడని ఆయన అన్నారు. కామ్రేడ్. శ్రీనివాసరావు అసియాలను స్మరించుకుంటూ పోరాటాలు చేస్తూనే గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తలంతా కలిసి గ్రామపంచాయతీ సర్పంచ్ నీ కైవసం చేసుకోవడ ఆయన ఆసియాలను సాధించినట్లు అవుతుందన్నారు. శ్రీనివాసరావు లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం పార్టీకి లోటుగా భావించినప్పటికీ ఆయన చేసిన త్యాగం వృధా కాలేదని ఆయన అన్నారు. సిపిఎం పార్టీ చేసే ఉద్యమాలు పోరాటాల వాళ్ళనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్ప, మరే ఏపార్టీలు కూడా పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసే స్వభావం వారికి లేదన్నారు. శ్రీనివాస రావు లాంటి వ్యక్తిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వత్సవాయి పద్మ, సిపి ఎం పార్టీ శాఖ కార్యదర్శి లింగం కోటి, కొల్లి నారాయణ, బండ్ల.రామయ్య, అలవాల నారాయణ, సాయి, ప్రవీణ్, నాగేశ్వరరావు,, తదితరులు పాల్గొన్నారు.




