
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
15 లీటర్ల గుడుంబా స్వాధీనం.. 250 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
సి కే న్యూస్ తొర్రూరు : తొర్రూరు మండలం భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ఎస్సై మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తండాలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 250 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిందితులపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై మహేందర్రెడ్డి తెలిపారు.
అక్రమ మద్యం తయారీ, విక్రయాలను ఉపేక్షించేది లేదని, గుడుంబా తయారీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.




