KhammamPoliticalTelangana

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలి మృ*తి...

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలి మృ*తి...

రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలి మృ*తి..

web desc : ద్విచక్రవాహనంపై వెళ్లిన పదేళ్ల చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృ*త్యువాత పడిన విషాద ఘటన రఘునాథపాలెం మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి గార్లపాటి రిషిక (10), ఆమెతోపాటు ప్రయాణిస్తున్న గుండేటి శ్రీను (18) మృతి చెందారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. రమణగుట్టకు చెందిన గార్లపాటి ముత్తయ్యకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె రిషిక ఖమ్మంలోని సెయింట్‌ ఇచ్ఛాస్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది.

పాఠశాలకు రెండు రోజుల సెలవులు రావడంతో రఘునాథపాలెంలోని గ్రీన్‌కాలనీలో నివసిస్తున్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం ఉదయం తన బంధువు వరసకు సోదరుడైన పెద్దమ్మ కొడుకు గుండేటి శ్రీనుతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది.

ఉదయం సుమారు 6.20 గంటల సమయంలో రఘునాథపాలెం గ్రామం జింకలబండ క్రాస్‌రోడ్డు సమీపంలో రోడ్డు దాటుతుండగా.. ఇల్లందు వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రమాదంలో రిషిక అక్కడికక్కడే మృతి చెందింది , శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని బొలేరో వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా..

వైద్యులు పరీక్షించి రిషిక. శ్రీను మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారును భూక్య కోట్వేరరావు అనే వ్యక్తి నడుపుతున్నట్లు తమకు తెలిసిందని ముత్తయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. అతివేగంగా, అజాగ్రత్తగా కారు నడిపి తన కుమార్తె రిషిక, శ్రీను ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఘటనపై రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button