HealthKarimnagarPoliticalTelangana

ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్ల విక్రయం.. మెడికల్ షాపు సీజ్!

ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్ల విక్రయం.. మెడికల్ షాపు సీజ్!

ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్ల విక్రయం.. మెడికల్ షాపు సీజ్!

web desc : కరీంనగర్ రూరల్ పోలీసులు డ్రగ్స్, హాష్ ఆయిల్ మరియు గంజాయిని స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుల్లో ఒకరైన నితిన్, జగిత్యాల జిల్లా వాసి, గత కొంతకాలంగా కరీంనగర్‌లోని బ్యాంక్‌లైన్ సమీపంలోని డీమార్ట్ వద్ద ఉన్న ఆరోగ్య ఫార్మసీ మెడికల్ షాపు యజమాని కొమ్మ రాముతో పరిచయం ఏర్పరుచుకున్నట్లు వెల్లడించారు.

నితిన్ తనకు ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని, ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టపాల్-50 తదితర మత్తు టాబ్లెట్లను అధిక ధరలకు కొమ్మ రాము వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం నితిన్‌తో పాటు మరో ఎనిమిది మంది కలిసి ఆ టాబ్లెట్లను నీటిలో కరిగించి, సిరింజీల ద్వారా తమ శరీరంలోని నరాల్లోకి ఎక్కించుకుని మత్తుకు అలవాటు పడినట్లు విచారణలో వెల్లడించారు.

అట్టి 9 మందిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. నిందితుల వాంగ్మూలంలో మెడికల్ షాపు నుంచి ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్లు కొనుగోలు చేసినట్లు వెల్లడైన నేపథ్యంలో, కరీంనగర్ రూరల్ పోలీసులు మెడికల్ షాపును తనిఖీ చేయాలని కోరుతూ కరీంనగర్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు లేఖ పంపించారు. దీంతో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రావణ్ కుమార్ తేదీ 29-08-2026న ఆరోగ్య ఫార్మసీ మెడికల్ షాపును తనిఖీ చేశారు.

తనిఖీలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, సంబంధిత వివరాలను రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయకపోవడం వంటి అంశాలను గుర్తించారు. అనంతరం నిబంధనల ప్రకారం మెడికల్ షాపును సీజ్ చేశారు. ఈ క్రమంలో మెడికల్ షాపు యజమాని కొమ్మ రామును కరీంనగర్ రూరల్ పోలీసులు తేదీ 30-08-2026 ఉదయం అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌లో పంచుల సమక్షంలో విచారించారు.

విచారణలో కొమ్మరాము అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో, ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మరియు సంబంధిత రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయకుండా, తనకు పరిచయమైన నితిన్‌కు గత కొంతకాలంగా టాబ్లెట్లు విక్రయించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి, కొమ్మ రాముపై అరెస్ట్ మెమో జారీ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ఈ కేసులో ఇప్పటికే స్వాధీనం చేసుకున్న టాబ్లెట్లు మరియు సిరింజీలను డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు పంపించి, వాటికి సంబంధించిన పూర్తి నివేదికను కోరడం జరిగింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నుండి నివేదిక అందిన అనంతరం, అందులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా మెడికల్ షాపు యజమాని కొమ్మ రాముపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుని చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నిరంజన్ రెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button