
కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తీవ్ర విమర్శలు
విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్ పాలన
సీకే న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇస్లావత్ నరసింహ సెప్టెంబర్ 09 2026: కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషం, విధ్వంస విధానాలతో పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎదుర్కొంటున్న వైఫల్యాలు, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ నాయకులు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ వైఫల్యాలపై సమాధానం చెప్పకుండా కొత్త రాజకీయ అంశాలను తెరపైకి తీసుకురావడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఆ అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా ప్రజలను తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, వాటిని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు.




