
రాజుపేటలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
రాజుపేట: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను గుర్తుచేస్తూ రాజుపేట గ్రామంలో పార్టీ నాయకులు, గిరిజనులు, గ్రామ ప్రజలు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలో గిరిజనుల సంక్షేమం కోసం గత ప్రభుత్వ హయాంలో పలు కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. 500కు పైగా జనాభా ఉన్న గిరిజన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక పాలనకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ అధికారిక పత్రాల్లో కూడా 500కు పైగా జనాభా ఉన్న అనేక గిరిజన నివాస ప్రాంతాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు నమోదైంది.
పాలేరు నియోజకవర్గంలో కందాళ ఉపేందర్ రెడ్డి సేవలు
పాలేరు నియోజకవర్గంలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సహకరించారని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు. గిరిజన ఐకమత్యం కోసం భూమి సేకరణతో పాటు గిరిజన భవన్ నిర్మాణానికి సహకరించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బానోత్ మహేష్, బానోత్ దేశిరం, బానోత్ సెట్రం నాయక్, ధరావత్ రాంకోటి, కొర్ర మంగ్య నాయక్, ధరావత్ సాకు బాయి, బానోత్ మంగీలాల్, ప్రభాకర్ రెడ్డి, జానిమియా, రాములు, నరసింహచారి, జానీ,సైదులు, రాజుల వీరయ్య,తదితరులు పాల్గొన్నారు.




