
సత్తుపల్లిలో మద్యం కల్తీన అసలిన?
సత్తుపల్లిలో మద్యం కల్తీన అసలిన?
సీల్ ఉండగానే తెరుచుకుంటున్న ఫుల్ బాటిల్ మూతలు.. నాణ్యతపై తీవ్ర అనుమానాలు!
సీల్ ఉండదు అంటున్న వైన్ యజమాని
ఎంతకు స్పందించని స్థానిక ఎక్స్సైజ్ శాఖ సి ఐ
మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటమా?
బాధ్యులెవరు.. అధికారుల పర్యవేక్షణ ఏది?
ఖమ్మం జిల్లా, సత్తుపల్లి:
సత్తుపల్లి పట్టణంలోని వివిధ వైన్ షాప్ లో మద్యం బాటిళ్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీల్ వేసి ఉన్న ఫుల్ బాటిల్ మూత తెరుచుకోవడం, దీంతో మద్యంలో కల్తీ జరిగిందా? అనే సందేహాలు తలెత్తడం కలకలం రేపుతోంది. మద్యం బాటిళ్ల సీలింగ్‌లో లోపమా? తయారీ లేదా ప్యాకింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యమా? లేక సరఫరా వ్యవస్థలో ఎక్కడైనా అక్రమాలు చోటుచేసుకున్నాయా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మద్యం తయారీదారులు, సరఫరాదారులు, విక్రయదారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అసలు కారణం అధికారుల విచారణలోనే తేలాల్సి ఉంది. బాటిల్ సీల్లో లోపం కనిపించినప్పుడు దాని నాణ్యతను నిర్ధారించకుండా విక్రయాలు ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కల్తీ మద్యం నిజమేనా? ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉందా?
మద్యం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మద్యం ప్రియుల్లో ఆందోళన నెలకొంటోంది. సంబంధిత ఎక్సైజ్ అధికారులు, నిపుణుల ద్వారా అవసరమైన పరీక్షలు నిర్వహించి, వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది.
చట్టం ఏం చెబుతోంది? బాధితులకు పరిహారం అందుతుందా?
మద్యం కల్తీ జరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయితే, దానికి బాధ్యులైన వారిపై వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి కేసులు నమోదు చేయడం, సంబంధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడం, విక్రయాలపై చర్యలు తీసుకోవడం వంటి పరిణామాలు ఉండవచ్చు. కల్తీ మద్యం సేవించి ఎవరైనా అనారోగ్యానికి గురైతే, వైద్య ఆధారాలు, బాధ్యత నిర్ధారణ ఆధారంగా నష్టపరిహారం కోరే అవకాశం కూడా ఉండవచ్చు.
బాద్యుల పై వెంటనే చర్యలు తీసుకోవాలి
సత్తుపల్లిలోని వద్ద వెలుగుచూసినట్లు చెబుతున్న ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి, బాటిల్‌ను పరీక్షించి, సరఫరా వివరాలను పరిశీలించి నిజానిజాలను వెల్లడించాలి. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే అంశాలపై నిర్లక్ష్యం వహించకుండా, బాధ్యులెవరో తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




