
సికె.న్యూస్. ప్రతినిధి..ఆదిలాబాద్
*విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి.. మొత్తం 20 మంది నిందితుల అరెస్ట్
గంజాయి కేసు దర్యాప్తుకు వెళ్లిన పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి*
ఐదుగురు పోలీసులకు గాయాలు.. ప్రభుత్వ పోలీసు వాహనం ధ్వంసం
సోమవారం ఏడుగురు, నేడు మరో 13 మంది అరెస్ట్
పోలీసుల విధులకు ఆటంకం కలిగించినా, దాడులకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసి, వారిని నిర్బంధించి, ప్రభుత్వ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో మొత్తం 20 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. సోమవారం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మంగళవారం మరో 13 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం స్థానిక పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు.
సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారుపేట గ్రామంలో అక్టోబర్ 10వ తేదీ ఉదయం గంజాయి కేసు దర్యాప్తులో భాగంగా వెళ్లిన పోలీసు సిబ్బందిపై ఈ దాడి జరిగింది. సిరికొండ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 90/2026, NDPS చట్టం కింద ఉన్న గంజాయి కేసు దర్యాప్తు నిమిత్తం ఇచోడా సీఐ సీహెచ్. రమేష్, కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు పోలీసు సిబ్బంది ప్రభుత్వ పోలీసు వాహనంలో బంగారుపేట గ్రామానికి వెళ్లారు.
గంజాయి కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన నేపథ్యంలో, కొందరు వ్యక్తులు గుంపుగా ఏర్పడి పోలీసులపై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వడంతో పాటు, పోలీసు సిబ్బందిపై కర్రలతో దాడి చేసి గాయపరిచినట్లు, వారిని బలవంతంగా సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు తెలిపారు.
అంతేకాకుండా పోలీసులను చంపుతామని బెదిరించడం, ప్రభుత్వ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఫోన్‌ను ధ్వంసం చేయడంతో పాటు మరో సెల్‌ఫోన్, క్రైమ్ నంబర్ 79/2026కు సంబంధించిన సీడీ ఫైల్‌ను అపహరించినట్లు తెలిపారు.
ఈ ఘటనలో కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్ ఎడమ చేతికి ఎముక విరగగా, ఇచోడా సీఐ సీహెచ్. రమేష్ భుజం, వీపు భాగాల్లో గాయాలయ్యాయి. ఏఎస్ఐ రాథోడ్ బలిరామ్ ఎడమ చేయి, తొడ, భుజానికి గాయాలయ్యాయి. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ భీంరావుకు కుడి చేయి, నడుము భాగాల్లో గాయాలు కాగా, ఏఆర్ కానిస్టేబుల్ గంగారాంకు తలపై రక్తస్రావ గాయమైంది.
ఈ ఘటనపై కానిస్టేబుల్ బత్తుల శివప్రసాద్ ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 92/2026 కింద BNS సెక్షన్లు 109, 303(2), 137, 121, 140, 191 r/w 190 మరియు ప్రభుత్వ ఆస్తుల నష్టం నివారణ చట్టం (PDPP Act) సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తును ఇచోడా పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించి, దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితుల అరెస్ట్ వివరాలు:
- A1 నుంచి A7 వరకు: ఏడుగురు నిందితులను 12-10-2026న అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి (హైదరాబాద్ జైలు) రిమాండ్‌కు తరలించారు.
- A8 నుంచి A20 వరకు: 13 మంది నిందితులను 13-10-2026న అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచడం జరిగింది.
1). చిక్రం రాము (38) s/o జగరావు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.(సర్పంచ్)
2). పెందూర్ బాదు పటేల్ @ పెందూర్ బదిరావు (33) s/o బందు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.(పటేల్)
3). పెందూర్ మారుతి (38) s/o జైతు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.(మాజీ ఎంపిటిసి)
4). చాకటి ఇంద్రకాంత్ (28) s/o రాములు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
5). సెడ్మాకే భీంరావు (27) s/o సోను, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
6). పెందూర్ అరుణ్ కుమార్ (32) s/o లక్ష్మణ్, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
7). పెందోర్ శ్రీరామ్ (32) s/o జ్యోతిరామ్, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
8). పెందోర్ జ్యోతిరామ్ (59) s/o పెందోర్ మోతిరామ్, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
9). కినక భీంరావు (64) s/o కినక రాజు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
10). పెందూర్ మహేశ్వర్ (35) s/o పెందోర్ రాజేశ్వర్, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.4
11). మడావి కృష్ణ (26) s/o మడావి సోనేరావు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
12). పెందూర్ రవి (26) s/o పెందూర్ జ్యోతిరామ్, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
13). పోయం తిరుపతి (18) s/o పోయం శంభు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
14). ఆత్రం జల్పతిరావు (55) s/o ఆత్రం మాణిక్రావు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
15). పెందూర్ మనోహర్ (45) s/o పెందూర్ జంగు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
16). సిదం నరేష్ (21) s/o సిదం భీంరావు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
17). గడ్డం విజయ్ కుమార్ (25) s/o గడ్డం రాజన్న, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
18). చేదం శ్రీనివాస్ (31) s/o చేదం పెద్దయ్య, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
19). పెందోర్ సోము (37) s/o పెందూర్ లచ్చు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
20). పోయం గంగారాం (37) s/o పోయం చిత్రు, వాయిపేట్ గ్రామం, సిరికొండ మండలం.
దాడిలో పాల్పడిన ఇతరుల పాత్ర పై దర్యాప్తు కొనసాగుతుందని, దాడిలో పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని తెలియజేశారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ: పోలీసు సిబ్బంది చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వారిపై దాడి చేయడం, విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసులపై దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పి రుత్వీక్ సాయి కొట్టే ఐపీఎస్ పాల్గొన్నారు.




