HealthHyderabadPoliticalTelangana

ఇద్దరు డ్రగ్స్‌ సప్లయర్స్ అరెస్ట్..బాచుపల్లిలో ఈగల్ ఫోర్స్ దాడులు

ఇద్దరు డ్రగ్స్‌ సప్లయర్స్ అరెస్ట్..బాచుపల్లిలో ఈగల్ ఫోర్స్ దాడులు

ఇద్దరు డ్రగ్స్‌ సప్లయర్స్ అరెస్ట్..బాచుపల్లిలో ఈగల్ ఫోర్స్ దాడులు

డ్రగ్స్‌ సప్లయ్‌ చేస్తూ గతంలో చిక్కిన వారి కాంటాక్ట్స్‌, కస్టమర్ల వివరాల ఆధారంగా అనుమానిత ప్రాంతాల్లో ఈగల్​ఫోర్స్ సోదాలు నిర్వహిస్తోంది. శుక్రవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని బాచుపల్లిలో డ్రగ్స్‌ విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసింది.

ఇద్దరిని అరెస్ట్‌ చేసి వారి నుంచి 6.2 గ్రాముల ఎండీఎంఏ, 5.83 గ్రాముల గంజాయి, వెయింగ్‌ మిషన్‌, రెండు ఐఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఈగల్ ఫోర్స్‌ కార్యాలయం పత్రికా ప్రకటనలో వివరాలు వెల్లడించింది.

మాదకద్రవ్యాల దందా కోసం జతకట్టి.. ఏపీ కడప జిల్లాకు చెందిన దినేశ్‌కుమార్‌(27) మాదాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వ్యక్తిగత ఖర్చుల కోసం రెండేండ్లుగా గంజాయి సప్లయ్‌ చేస్తున్నాడు. మాదాపూర్‌ సహా కూకట్‌పల్లి, బాచుపల్లి శివారు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నాడు.

బాచుపల్లిలోని ఎలీషియన్‌ స్నూకర్‌ క్లబ్‌ వద్ద ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా దినేశ్​కు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నీళాభ్‌ శర్మ(24) పరిచయం అయ్యాడు. వీరిద్దరూ రూ.5 వేలకు గ్రాము ఎండీఎంఏ, రూ.600కు గ్రాము గంజాయి పాకెట్‌ కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే గంజాయి కస్టమర్ల డేటా ఆధారంగా దినేశ్‌కుమార్‌ కదలికలపై ఈగల్‌ ఫోర్స్‌ నిఘా పెట్టింది.

బాచుపల్లిలోని మమతా హాస్పిటల్‌ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో గంజాయి, డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసింది. డెకాయ్‌ ఆపరేషన్‌లో దినేశ్‌, నీళాభ్‌ను అరెస్ట్‌ చేసింది. వీరి వద్ద గంజాయి, డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుని విచారించింది. మణికంఠ, జేఎన్‌ సుహాస్‌ అనే వ్యక్తుల వద్ద ఎండీఎంఏ, గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించింది. ఆ ఇద్దరి కోసం అధికారులు గాలిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button