HealthHyderabadKhammamPoliticalTelangana

బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా...

బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా...

బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా…

బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడికి నేనున్న అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. నేను నీకు అండగా ఉంటా.. భయపడకు అంటూ భరోసానిచ్చారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ, అనిత దంపతుల 13 ఏళ్ల కుమారుడు కర్నె వినయ్ ప్రస్తుతం బ్రెయిన్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కేటీఆర్‌ను కలవాలని, ఆయనతో ఒక ఫోటో దిగాలన్నది వినయ్ కోరిక.

అయితే స్థానిక నేతల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ వెంటనే వినయ్‌ పరిస్థితిని, అతడి కోరికను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కందాల ఉపేందర్‌ వినయ్‌ కుటుంబసభ్యులను కేటీఆర్‌ను కల్పించారు.ఈ సందర్భంగా కేటీఆర్‌ హాయ్‌ వినయ్‌ అని ఆప్యాయంగా పలకరించారు. ఎన్నో క్లాస్ చదువుతున్నవ్‌ అని అడిగితే ఎనిమిదో తరగతి అని చెప్పాడు వినయ్‌. ఏం కాదు..

మంచిగైతవ్‌.. బాధపడకు.. మందులేసుకో.. నేను ట్రీట్‌మెంట్‌ చేయిస్తా.. అని గిఫ్ట్‌ ప్యాక్‌ను వినయ్‌కు అందించారు కేటీఆర్‌. ఏం బాధపడొద్దమ్మా.. వినయ్‌కు ఉత్తమ వైద్యం అందించేలా ప్రయత్నం చేస్తాం.. అంటూ వినయ్ తల్లిదండ్రులకు హామీనిచ్చారు. బాలుడికి అవసరమైన మెరుగైన వైద్య సహాయం అందేలా చూస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button