HyderabadPoliticalTelangana

మద్యం మత్తులో కన్నకొడుకునే గొంతు నులిమి హ*త్య...

మద్యం మత్తులో కన్నకొడుకునే గొంతు నులిమి హ*త్య...

మద్యం మత్తులో కన్నకొడుకునే గొంతు నులిమి హ*త్య…

Web desc : మద్యం మత్తులో ఓ తండ్రి కన్నబిడ్డపైనే కర్కశత్వం ప్రదర్శించాడు. అభం శుభం తెలియని ఐదేళ్ల కుమారుడి గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. హైదరాబాద్‌లోని బోరబండలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో తండ్రే కుమారుడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

తల్లి ఇంట్లో లేని సమయంలో ఘాతుకం.. వివరాల్లోకి వెళ్తే.. బోరబండ శిల్పినగర్‌కు చెందిన విద్యాసాగర్‌ (36) తన ఐదేళ్ల కుమారుడు విజయ్‌తో కలిసి ఇంట్లో ఉన్నాడు. బాలుడి తల్లి దుర్గ క్యాటరింగ్‌ పనుల నిమిత్తం బయటకు వెళ్లింది. ఈ క్రమంలో విద్యాసాగర్‌ మద్యం మత్తులో కుమారుడి గొంతు నులిమినట్లు సమాచారం.

రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున ఇంటికి వచ్చేసరికి.. పనులు ముగించుకుని తెల్లవారుజామున ఇంటికి తిరిగొచ్చిన దుర్గకు ఊహించని విషాదం ఎదురైంది.

తన కుమారుడు విజయ్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆమె వెంటనే పొరుగువారికి సమాచారం అందించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

నిందితుడి కోసం పోలీసుల గాలింపు.. సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతికి సంబంధించిన వివరాలను సేకరించారు.

అయితే పోలీసులకు విషయం తెలిసిన వెంటనే నిందితుడు విద్యాసాగర్‌ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. బాలుడి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న విద్యాసాగర్‌ కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button