KhammamPoliticalTelangana

శ్రీనిధి నిధులు పక్కదారి.. రూ.36.46 లక్షల బకాయిలు!

శ్రీనిధి నిధులు పక్కదారి.. రూ.36.46 లక్షల బకాయిలు!

శ్రీనిధి నిధులు పక్కదారి.. రూ.36.46 లక్షల బకాయిలు!

సొంత అవసరాలకు రూ.28 లక్షలు వినియోగం

బకాయిలు చెల్లించకుంటే ఆర్ఆర్ చట్టం ప్రకారం ఆస్తుల జప్తు.. వేలం ద్వారా రికవరీ

గ్రామసభలో అధికారుల సమక్షంలో అగ్రిమెంట్

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ నవంబర్ 09 2026: మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి కోసం కేటాయించిన శ్రీనిధి నిధులు పక్కదారి పట్టిన వ్యవహారం ఏన్కూరు మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. 2019 నుంచి 2026 వరకు సుమారు రూ.28 లక్షల అసలు మొత్తాన్ని సొంత అవసరాలకు వినియోగించినట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. అసలు మొత్తానికి వడ్డీ కలిపి మొత్తం రూ.36,46,303 చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ బకాయిలను నిర్ణీత విధంగా చెల్లించని పక్షంలో ఆర్ఆర్ చట్టం ప్రకారం స్థిర, చరాస్తులను జప్తు చేసి, వేలం ద్వారా వచ్చిన మొత్తంతో శ్రీనిధి బకాయిలను రికవరీ చేసుకునేందుకు అగ్రిమెంట్ రాసిచ్చినట్లు తెలిసింది. ఏన్కూరు గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 30 మహిళా సంఘాలు ఉండగా, వాటిలో 125 మంది సభ్యులు ఉన్నారు.

ఈ సంఘాలకు సంబంధించిన శ్రీనిధి ఆర్థిక లావాదేవీలు, రుణాల వినియోగం, తిరిగి చెల్లింపులపై నిర్వహించిన సామాజిక తనిఖీల్లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2019 నుంచి 2026 వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించగా సుమారు రూ.28 లక్షల అసలు మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు గుర్తించారు. వడ్డీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం రూ.36,46,303కు చేరింది.

ఈ వ్యవహారంపై ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ, ఈపీఎం శ్యామ్ కుమార్, శ్రీనిధి మేనేజర్ చారి, ఆడిటర్లు భూమి, మీనా మూడు రోజులపాటు గ్రామంలో పర్యటించి సంబంధిత రికార్డులు, లావాదేవీలను పరిశీలించారు. అనంతరం గ్రామసభ నిర్వహించి శ్రీనిధి బకాయిలు, ఆర్థిక లావాదేవీల వివరాలను వెల్లడిస్తూ సభ్యులతో చర్చించారు.
బకాయిల వసూలు విషయంలో అధికారులు కఠిన వైఖరి అవలంబించారు.

చెల్లించాల్సిన రూ.36,46,303 మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అంగీకరిస్తూ సంబంధిత వ్యక్తులు అగ్రిమెంట్ రాసిచ్చినట్లు తెలిసింది. నిర్ణీత షరతుల ప్రకారం బకాయిలు చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం కింద సంబంధిత స్థిర, చరాస్తులను జప్తు చేసి వేలం వేయడం ద్వారా బకాయిలను వసూలు చేసి శ్రీనిధి ఖాతాలో జమ చేసుకునే విధంగా ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

మండలవ్యాప్తంగా సామాజిక తనిఖీలు

ఏన్కూరు గ్రామంలో వెలుగుచూసిన ఈ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకుని మండలంలోని అన్ని గ్రామాల్లోనూ శ్రీనిధి ఆర్థిక లావాదేవీలపై సామాజిక తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళా సంఘాలకు మంజూరైన రుణాలు, వాటి వినియోగం, చెల్లింపులు, పెండింగ్ బకాయిల వివరాలను సమగ్రంగా పరిశీలించనున్నారు. మహిళా సంఘాల అభ్యున్నతి కోసం కేటాయించిన నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం వల్ల సంఘాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇలాంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా అధికారులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక తనిఖీల ద్వారా వెలుగులోకి వచ్చిన బకాయిలను పూర్తిస్థాయిలో రికవరీ చేసి, శ్రీనిధి నిధుల వినియోగంలో పారదర్శకతను నిర్ధారించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button