PoliticalSanga reddyTelangana

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. ఆరుగురు అరెస్ట్, రూ.35 వేల నగదు స్వాధీనం!

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. ఆరుగురు అరెస్ట్, రూ.35 వేల నగదు స్వాధీనం!

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. ఆరుగురు అరెస్ట్, రూ.35 వేల నగదు స్వాధీనం!

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండల పరిధిలోని గంగ్వార్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై హద్నూర్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.35,226 నగదును స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో పోలీసుల దాడి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 12వ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో గంగ్వార్ గ్రామ శివారులోని ఉత్సవ్ ధాబా వెనుక ఖాళీ ప్రదేశంలో కొందరు వ్యక్తులు డబ్బులు పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన పోలీసు సిబ్బందితో కలిసి అక్కడ ఆకస్మికంగా దాడి నిర్వహించారు. పోలీసులను గమనించిన పేకాటరాయుళ్లు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు.

పట్టుబడిన వారిని మిర్జాపూర్-బి గ్రామానికి చెందిన గూడాడి వెంకటరెడ్డి, మహమ్మద్ సల్మాన్, జాముస్బవాలె, సయ్యద్ ఉస్మాన్ గని, కుమ్మరి మోహన్, గూడాడి సుధాకర్ రెడ్డి, మంగలి ఆనంద్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పేకాట స్థావరం వద్ద పంచనామా నిర్వహించిన పోలీసులు మొత్తం రూ.35,226 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ దోమ సుజిత్ వెల్లడించారు.

మండల పరిధిలో ఎవరైనా పేకాట లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఎక్కడైనా పేకాట జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button