PoliticalTelangana

ఇన్‌ స్టాగ్రామ్ సెలెబ్రిటీ మీనాక్షి అరెస్ట్.. తనిష్క్‌లో 21 కోట్ల విలువైన బంగారం, డైమండ్ చోరీ..

ఇన్‌ స్టాగ్రామ్ సెలెబ్రిటీ మీనాక్షి అరెస్ట్.. తనిష్క్‌లో 21 కోట్ల విలువైన బంగారం, డైమండ్ చోరీ..

ఇన్‌ స్టాగ్రామ్ సెలెబ్రిటీ మీనాక్షి అరెస్ట్.. తనిష్క్‌లో 21 కోట్ల విలువైన బంగారం, డైమండ్ చోరీ..

Web desc : మదురైలో సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇటీవల ప్రారంభమైన ‘తనిష్క్’ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన రూ.21 కోట్ల విలువైన బంగారం, డైమండ్ ఆభరణాల భారీ చోరీ కేసులో ఒక ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మదురైలోని బైపాస్ రోడ్డులో కొత్తగా తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభమైంది. అయితే, నవంబర్ 12 ఉదయం షోరూమ్ సిబ్బంది వచ్చి చూసేసరికి షాక్ తగిలింది. ఫస్ట్ ఫ్లోర్‌లోని డిస్‌ప్లే కౌంటర్లలో ఉండాల్సిన భారీ ఎత్తున బంగారు, వజ్రాభరణాలు కనిపించలేదు. నగల డబ్బాలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

ప్రారంభమై కొద్ది రోజులే కావడంతో ఈ భారీ చోరీ స్థానికంగానే కాక రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మొదట సుమారు 4 కిలోల బంగారం గల్లంతయినట్లు భావించినా, పూర్తి విచారణలో దాదాపు 15 కిలోల పైచిలుకు బంగారం, విలువైన డైమండ్ ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వీటి మొత్తం విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 21 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన మదురై సిటీ పోలీసులు.. సీసీటీవీ పుటేజీలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూపీ లాగారు. ఈ చోరీకి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నిశాంత్ అనే యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే నిశాంత్‌కు సహకరించినట్లు, అలాగే చోరీ చేసిన సొత్తు ఎక్కడ దాచారో కచ్చితంగా తెలిసిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ ఫ్లుయెన్సర్‌, యూట్యూబర్ మీనాక్షి, అలాగే ప్రధాన నిందితుడు నిశాంత్ తండ్రి సురేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల అదుపులో కీలక ఆధారాలు… నిందితుల నుంచి ఇప్పటివరకు సుమారు 5 కిలోల చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. మిగతా బంగారం కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితులు మొబైల్ ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా ఆధారంగానే పోలీసులు వీరిని గుర్తించగలిగారు. షోరూమ్‌లో జరిగిన ఇంటీరియర్, ఎలక్ట్రికల్ పనులను ఆసరాగా చేసుకునే నిందితులు ఈ చోరీకి వ్యూహం పన్నినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button