KhammamPoliticalTelangana

పంచాయతీ కార్యదర్శిపై దాడికి యత్నం.. వ్యక్తిపై కేసు నమోదు

పంచాయతీ కార్యదర్శిపై దాడికి యత్నం.. వ్యక్తిపై కేసు నమోదు

పంచాయతీ కార్యదర్శిపై దాడికి యత్నం.. వ్యక్తిపై కేసు నమోదు

విధులకు ఆటంకం.. అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులు

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు నవంబర్ 18 2026: గ్రామ పంచాయతీ కార్యదర్శిపై దాడికి యత్నించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై ఏన్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఏన్కూరు మండలంలోని బురద రాఘవాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కంచర్ల కోటేశ్వరరావు బుధవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో విధుల్లో ఉండగా, అదే గ్రామానికి చెందిన బాదావత్ రామదాస్ కార్యాలయానికి వచ్చి ఆయనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడికి యత్నించి, బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విధి నిర్వహణకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి యత్నించినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏన్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న సమయంలో వారిపై దాడులకు పాల్పడటం, బెదిరించడం, విధులకు ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button