MedchalPoliticalTelangana

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి..

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి..

Web desc : మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ పంచాయతీ మరోసారి అవినీతి ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. కొంతకాలంగా అవినీతి మచ్చకు మారుపేరుగా మారిన ఎల్లంపేటలో, అక్రమాలకు పాల్పడుతున్న ‘అవినీతి తిమింగలాల’ భరతం పట్టే దిశగా అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీ కార్యదర్శి (సెక్రెటరీ) రవీందర్ రెడ్డి శుక్రవారం రోజు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

​గత కొంతకాలంగా ఎల్లంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులు, అనుమతుల జారీ విషయంలో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజల, పనులు కావాలంటే లంచాలు ఇవ్వాల్సిందేనన్న దుస్థితి నెలకొందని, ఈ గ్రామం అవినీతికి అడ్డాగా మారిందని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే పంచాయతీ కార్యదర్శి రవీందర్ రెడ్డిపై నిఘా పెట్టిన అధికారులు, ఈరోజు ఆయనను పట్టుకోవడంతో గ్రామంలోని అవినీతి బాగోతం మరోసారి బట్టబయలైంది. ​పంచాయతీ కార్యదర్శి పట్టుబడటంతో గ్రామంలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన మిగిలిన అవినీతి తిమింగలాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉంది? గతంలో జరిగిన అక్రమాల వెనుక ఉన్న పెద్దలు ఎవరు? అనే కోణంలో లోతైన విచారణ జరిపితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button