HyderabadPoliticalTelangana

మంత్రి OSD నంటూ నకిలీ ఐడి... ఉద్యోగాల పేరుతో మోసం

మంత్రి OSD నంటూ నకిలీ ఐడి... ఉద్యోగాల పేరుతో మోసం

మంత్రి OSD నంటూ నకిలీ ఐడి… ఉద్యోగాల పేరుతో మోసం

Web desc : హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ (OSD)గా చలామణి అవుతూ జాబ్ కోసం చూస్తున్న నిరుద్యోగులను మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మంత్రి ఓఎస్డీగా అవతారమెత్తిన కొలుగూరి రవికిరణ్ అనే చీటర్, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.50.87 లక్షలు కాజేశాడు.

ఈ వ్యవహారంపై పరిశ్రమల శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఓఎస్డీ ఐడీ కార్డులు, నకిలీ ప్రభుత్వ నియామక ఉత్తర్వులను సృష్టించి నిందితుడు నిరుద్యోగులను, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులను బురిడీ కొట్టించాడు.

అంతేకాకుండా, అసలైన ప్రభుత్వ వెబ్సైట్లను పోలిన నకిలీ పోర్టల్స్ను రూపొందించి నిరుద్యోగులకు పూర్తి నమ్మకం కలిగించాడు. టీచర్, మున్సిపల్ అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మొత్తం నలుగురు బాధితుల నుంచి రూ.50.87 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.

మోసపోయిన బాధితులు నేరుగా మంత్రి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం బట్టబయలైంది. నిందితుడు సృష్టించిన నకిలీ వెబ్సైట్లు, డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అధికారులు పోలీసులను కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button