NationalPolitical

ఆర్మీ జవాన్‌కు చలాన్ వేసిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

ఆర్మీ జవాన్‌కు చలాన్ వేసిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

ఆర్మీ జవాన్‌కు చలాన్ వేసిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

Social media viral : రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ఒక ఆర్మీ జవాన్‌కు జరిమానా విధించినందుకు అస్సాం రాష్ట్ర రవాణా శాఖ కు చెందిన ఓ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్‌కు గురయ్యారు. అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

జోర్హాట్ జిల్లాలో రహదారి భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, ఒక ఆర్మీ వాహన డ్రైవర్ సీటు బెల్టు ధరించకపోవడాన్ని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ గుర్తించారు. నిబంధనల ప్రకారం సదరు ఆర్మీ సిబ్బందికి ట్రాఫిక్ చలాన్ విధించిన అధికారి, ఆధారంగా ఒక ఫోటో కూడా తీశారు. ఆర్మీ సిబ్బందికి చలాన్ విధించి, ఫోటో తీసిన వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో రవాణా శాఖ చర్యలకు ఉపక్రమించింది.

ఈ ఘటన జరిగిన ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే సదరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధి నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసిన అధికారిపై సస్పెన్షన్ వేటు పడటం స్థానికంగా చర్చకు దారితీసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button