HyderabadNotificationPoliticalTelangana

హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

హైదరాబాద్ : నవంబర్ 21
తెలంగాణ పోలీస్ అపార్ట్మెంట్ లో హోంగార్డుల నియమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, 2 వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ పై డిజిపి సీవీ ఆనంద్, కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖను తీర్చిదిద్దడం సిబ్బంది సంక్షేమం శిక్షణ నియమకాలు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై మినీ స్టాఫ్ అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.

ఇందుకు సంబంధిం చిన నోటిఫికేషన్, ఇతర వివరాలపై అధికారులు చర్చించారు. అయితే నోటిఫికేషన్ విడుదల తేదీ, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తుల ప్రక్రియ వంటి వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే పెరుగుతు న్న అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖలో ప్రస్తుతం మంజూరైన సిబ్బంది సంఖ్యను పునఃసమీక్షించాలని నిర్ణయించారు.

మారుతున్న పరిస్థితులు, పోలీస్ శాఖ అవసరాలకు అనుగుణంగా నూతన తెలంగాణ పోలీస్ మాన్యువల్‌ ను రూపొందించి త్వరగా పూర్తి చేసి విడుదల చేసే అంశంపైనా చర్చించారు. పోలీసు సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించేందుకు వార్షిక శిక్షణ క్యాలెండర్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు.

అలాగే పోలీస్ బ్రాస్‌, పైప్ బ్యాండ్లను పునరుద్ధరించే అంశాన్ని కూడా పరిశీలించారు. వచ్చే నెలలో నిర్వహించనున్న పోలీస్ రిట్రీట్‌తో పాటు మహిళా పోలీస్ అధికారుల సదస్సు ఏర్పాట్లపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష చేశారు.

రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌, ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్‌ నిర్వహణకు సంబంధించిన అంశాలను కూడా చర్చించారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button