HyderabadPoliticalTelangana

సచివాలయ ఉద్యోగి అరెస్ట్‌…

సచివాలయ ఉద్యోగి అరెస్ట్‌…

Web desc : అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన పింఛన్‌ సొమ్మును సొంత ఖర్చులకు వినియోగించుకున్న సచివాలయ ఉద్యోగిని మల్కాపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం.. 79వ వార్డు జనతా కాలనీ సమీపంలోని సచివాలయంలో బిల్లి దేవుడుబాబు ఎడ్యుకేషన్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ నెలకు సంబంధించి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన పింఛన్‌ సొమ్ము రూ.2.17 లక్షలను సచివాలయ అడ్మిన్‌ నాగరాజు ఆయనకు అప్పగించారు.

అయితే దేవుడుబాబు కేవలం రూ.83 వేలు మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసి, మిగిలిన రూ.1.34 లక్షలను సొంత ఖర్చులకు వినియోగించుకున్నాడు. అక్టోబర్‌ 1వ తేదీ సాయంత్రం వరకు పింఛన్‌ సొమ్ము అందకపోవడంతో లబ్ధిదారులు మరుసటి రోజు సచివాలయ అడ్మిన్‌ నాగరాజును సంప్రదించారు. దీంతో ఆయన దేవుడుబాబుకు ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ వచ్చింది.

ఇంటి వద్ద కూడా లేకపోవడంతో అనుమానం వచ్చిన నాగరాజు మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, పింఛన్‌ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు దేవుడుబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button