
పేదల ఆరోగ్యమే లక్ష్యంగా నాగులవంచలో మెగా వైద్య శిబిరం…ప్రారంభించిన సర్పంచ్ నారగాని రాంబాయి
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
నవంబర్ 28
చింతకాని మండలం నాగులవంచ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం నాడు “నవశకం” మరియు “అంబేద్కర్ సేవా సంఘం” సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సేవా దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సర్పంచ్ రాంబాయి ప్రశంసించారు.ఈ వైద్య శిబిరంలో నవశకం ఫౌండర్ మేకల రమేష్, అంబేద్కర్ స్వచ్ఛంద సేవా సంఘం అధ్యక్షులు అంబేద్కర్ నాగరాజ్, చింతకాని మండల బీజేపీ అధ్యక్షులు గోపి, తిరుమలాపురం సర్పంచ్ వీరబాబు, చిన్నమండవ సర్పంచ్ రామచంద్ర రావు, చింతకాని మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నాగేంద్రబాబు, పాతర్లపాడు ఉపసర్పంచ్ దారెల్లి సురేష్ పాల్గొన్నారు.
వీరితో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు రవీంద్ర, గుండ్ల రాంబాబు, ఉపేంద్ర, ఎంఎస్‌ఎఫ్ చింతకాని మండల అధ్యక్షులు విజయ, ఉపాధ్యక్షులు నరసింహారావు, ప్రవీణ్, నవీన్, గ్రామ పెద్దలు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




