Telangana

కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి...

కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి...

కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి…

పెళ్లయి కొన్ని గంటలు కూడా కాలేదు. వధువు కాళ్ల పారాణి కూడా ఇంకా ఆరలేదు. ఇంతలోనే ఆ వధువును మృత్యువు పగబట్టింది. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందిన విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దెబ్బగడ్డ గ్రామంలో జరిగింది.

వివాహం జరిగిన కొన్ని గంటల వ్యధిలో వధువు అఖిల (20) మృతి చెందగా.. ఆమె మృతితో దెబ్బగడ్డ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పార్వతీపురంకు చెందిన వెత్స అఖిలకు, దెబ్బగడ్డ గ్రామంకు చెందిన భాస్కరరావుకు శుక్రవారం రాత్రి 10 గంటలకు వివాహం జరిగింది. వివాహ అనంతరం నిద్రించిన వధువు అపస్మారక స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులు మక్కువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ప్రథమ చికిత్సలు చేసిన వైద్యులు.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కొరకు సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించమని సూచించారు. కుటుంబ సభ్యులు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించగా.. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మార్గమధ్యలోనే చనిపోయిందని తెలియజేశారు.

పోస్టుమార్టం నివేదికలో మరణానికి గల కారణాలు తెలియజేస్తామన్నారు. వధువు మరణంతో ఇరు కుటుంబాలు దుఃఖ సంద్రంలో మునిగిపోయాయి. ఇంట్లో శుభకార్యం జరిగిన కొన్ని గంటల్లోనే ఇలా జరగడంతో కుటుబసభ్యులలో విషాదం అలుముకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button