KhammamPoliticalTelangana

పురుగులు మందు తాగి రైతు బలవన్మరణం

పురుగులు మందు తాగి రైతు బలవన్మరణం

ఖమ్మం జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. పురుగులు మందు తాగి ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్‌కు కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే, ఆ పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారంటూ ప్రభాకర్ ఇటీవల ఎమ్మార్వో, ఎస్సైకి ఇతర అధికారులకు ఫిర్యాదు చేశాడు.

కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతు ప్రభాకర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన పొలాన్ని కాపాడుకునే మార్గం లేదంటూ కన్నీరుమున్నీరయ్యాడు.

తనకు ఇక ఆత్మహత్యే శరణ్యమని డిసైడ్ అయిన రైతు ప్రభాకర్ పురుగుల మందు తాగుతూ.. ఓ సెల్ఫీ వీడియో చేశాడు.

అందులో.. ‘రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ వీడియో తన గోడును వెల్లబోసుకుంటూ రైతు ప్రభాకర్ ప్రాణాలు విడిచాడు.

అయితే, డిప్యూటీ సీఎం ఇలాఖాలో జరిగిన ఈ సంచలన ఘటన ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button