HyderabadPoliticalTelangana

బదిలీ అయిన ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్వాకం...

బదిలీ అయిన ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్వాకం...

బదిలీ అయిన ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్వాకం…

ఒకే రోజు 300 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌…

అనుమానంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయగా…

సంగారెడ్డి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ వెళ్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపాడు. ఒకే రోజు ఏకంగా 300 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేశాడు.

ఒకే రోజు అంత పెద్ద మొత్తంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు కావడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయడంతో ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్వాకం బయటపడింది.

సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒకే రోజు పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కావడంతో ఏసీబీ అధికారులు తాజాగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ జరిగిన డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు.

తనిఖీలు చేస్తున్న క్రమంలో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి కిటికీలో నుంచి రూ.96వేల నగదును బయటకు విసిరివేయడం కలకలం సృష్టించింది.

సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

అయితే జిల్లాలోని ఏసీబీ అధికారులకు తెలియకుండా హైదరాబాద్‌ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఏసీబీ అధికారుల బృందం ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button