HyderabadPoliticalTelangana

బట్టబయలైన ఓయో రూమ్‌ హోటల్ యజమాని నిర్వాకం

బట్టబయలైన ఓయో రూమ్‌ హోటల్ యజమాని నిర్వాకం

జంటలే అతడి టార్గెట్..! బట్టబయలైన ఓయో రూమ్‌ హోటల్ యజమాని నిర్వాకం

జంటలనే టార్గెట్ గా చేసుకున్న ఓ హోటల్ నిర్వాహకుడు ఓయో రూమ్ లో హిడెన్ కెమెరా పెట్టి, కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బు గుంజుతున్నాడు.

ఓ జంట ఫిర్యాదుతో హోటల్ యజమాని నిర్వాకం వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ లో సితా గ్రాండ్ పేరుతో ఓయో సంస్థతో కలిసి గదులు అద్దెకు ఇచ్చే హోటల్ నడుపుతున్నారు.

అయితే జంటలనే టార్గెట్ గా చేసుకున్న హోటల్ నిర్వాహకుడు గదిలో రహస్య సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. రూంలు అద్దెకు తీసుకున్న వ్యక్తుల ఏకాంత వీడియోలు రికార్డు చేసి, వారిని బెదిరింపులకు గురి చేసేవాడు.

ఎంతో కొంత డబ్బు ముట్టచెబితే వీడియో డిలీట్ చేస్తానని, లేకపోతే సామాజిక మాద్యమాల్లో పెడతానని చెప్పి డబ్బు గుంజేవాడు. ఇలాగే ఓ జంటను కూడా బెదిరించే ప్రయత్నం చేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో హోటల్ నిర్వాహుకుడి బండారం బట్టబయలు అయ్యింది.

ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. అతని నుంచి రెండు ఫోన్లు, సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. ఓయో రూం పేరుతో హోటల్ నడుపుతూ.. ఇలా చాలాకాలంగా బెదిరింపులకు గురి చేసి, డబ్బు తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button