ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోరా ?
ప్రభుత్వ స్థలమని తేల్చిన అధికారులు మరి చర్యలు ఎందుకు తీసుకోరు ?;
ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోరా ?
ప్రభుత్వ స్థలమని తేల్చిన అధికారులు మరి చర్యలు ఎందుకు తీసుకోరు ?
ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడంపై అధికారులు చర్యలు తీసుకునేది ఎప్పుడు ?
పలు దినపత్రికల్లో ప్రచురిస్తున్నప్పటికీ అక్రమ కట్టడాన్ని ఆపలేక పోయిన అధికారులు
ప్రభుత్వ స్థలంలోనే కట్టడం అని తేల్చినాక ఫుట్ పాత్ ఆక్రమిస్తూ రోడ్డు దాకా నిర్మాణం
ప్రశాంత్ నగర్ ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కట్టడం కూల్చేదెప్పుడు ?
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
ఫిబ్రవరి 12,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్ గ్రామ పంచాయతీ నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వ స్థలంలో కట్టడం మొదలుపెట్టారు. ఆనాడే రెవిన్యూ సిబ్బంది స్పందించి ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టడం జరిగింది. దాన్ని ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణ దారులు భవనాన్ని నిర్మించారు.
నిర్మించారు కానీ దాని ప్రారంభోత్సవం చేయలేకపోయారు ఎందుకంటే అది ప్రభుత్వ స్థలంలో కట్టారు కాబట్టి దానికే ఎటువంటి అనుమతులు లేవు. ఆనాటి సెక్రటరీ వారికి ఎటువంటి ఎన్ఓసి కూడా ఇవ్వలేదు దీనితో నిర్మాణం మూడు సంవత్సరాలుగా ఖాళీగానే ఉండడం జరిగింది.
ఏమి జరిగిందో ఏమో కానీ గత ఆరు నెలల క్రితం హోటల్ పెట్టుకోవడం అనుమతులు లేకుండానే పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వ స్థలమే అని తెలిసి దాని నిర్మాణదారులు నేషనల్ హైవే రోడ్డు వరకు నిర్మాణాన్ని మరలా చేపట్టడం జరిగింది. నేషనల్ హైవే రోడ్డు పక్కనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ స్థలం అని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారులు ఎందుకు దానిని స్వాధీనపరచుకో లేకపోతున్నారు తెలియాల్సి ఉంది. ప్రభుత్వ స్థలమే అని కలెక్టర్ కి సమర్పించారు మరి కలెక్టర్ దగ్గర నుంచి ఏమైనా ఆదేశాలు రావాలా తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనాపటికి ప్రభుత్వ స్థలంలో నిర్మాణమై తెలిసిన తర్వాత ఉపేక్షించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజల ఆడుకుంటున్నారు. ఆ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటారా అని ప్రశాంత్ నగర్ గ్రామ ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటే ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది.