పార, పలుగు పట్టి మట్టి తవ్విన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పార, పలుగు పట్టి మట్టి తవ్విన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.;

By :  Ck News Tv
Update: 2025-02-20 11:54 GMT

పార, పలుగు పట్టి మట్టి తవ్విన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),

ఫిబ్రవరి 20,

టేకులపల్లి మండలం లో జిల్లా కలెక్టర్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సులానగర్, చింతలంక, కోయగూడెం, చంద్రు తండా, కొత్త తండా గ్రామ పంచాయతీల లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు.పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం క్రింద చేపడుతున్న ఫారం చెరువు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు, పని ప్రదేశంలో త్రాగునీరు వసతి కల్పిస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కూలీలతో మమేకమై వారితో ముచ్చటిస్తూ పలుగు పారా పట్టి మట్టిని తవ్వికూలీల లో ఉత్త్సాహన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంత మంది కూలీలు పనిచేస్తున్నారు, పనిచేసే ప్రాంతం లో త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, జాబ్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి పనిదినాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కోయగూడెం లో రైతు పకీర్ కు చెందిన పొలంలో ఆగస్టు నెలలో నాటి సాగు చేస్తున్న మునగ సాగును కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మునగ కాయలతో పాటు ఆకు ను కూడా పొడిచేసి అమ్మవచ్చని, రైతులు లాభదాయకమైన మునగ పంట పండించి ఆర్థికా అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం చింతలంక గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీ సందర్శించారు

ఈ సందర్భంగా కలెక్టర్ నర్సరీలలో ప్రజలకు ఉపయోగపడే మొక్కలు పెంచాలని, వేసవిలో ఎండ ప్రభావం వల్ల మొక్కలు చనిపోకుండా రోజుకు రెండుసార్లు నీరు పొయ్యాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన మట్టి కట్టల పనిని పరిశీలించి తగు సూచనలు చేశారు.

ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట డీఎల్‌పీఓ రమణ, మిషన్ భగీరథ డీఈ పద్మావతి, విద్యుత్ శాఖ డీఈ రంగస్వామి, ఎంపీడీవో రవీందర్ రావు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News