చీకటి కార్తీక్ కు మంత్రి పొంగులేటి అభినందన
చీకటి కార్తీక్ కు మంత్రి పొంగులేటి అభినందన;
చీకటి కార్తీక్ కు మంత్రి పొంగులేటి అభినందన.
పార్టీ గెలుపులో యువజన నాయకుల పాత్ర కీలకం.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచన.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 19,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమితులై ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని చీకటి కార్తీక్ హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చీకటి కార్తీక్ ను మంత్రి పొంగులేటి అభినందించారు. పార్టీ గెలుపులో యువజన నాయకుల పాత్ర కీలకమన్నారు. రాబోవు స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేలా యువజన నాయకులు కృషి చేయాలన్నారు.
అదేవిధంగా యువజన విభాగం తరుపున విస్తృతంగా సేవా కార్యక్రమాలను చేపట్టాలని చీకటి కార్తీక్ కు మంత్రి పొంగులేటి సూచించారు.