కాంగ్రెస్ బ్రాండ్ 'పొదెం'కు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే
కాంగ్రెస్ బ్రాండ్ 'పొదెం'కు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే;
కాంగ్రెస్ బ్రాండ్ 'పొదెం'కు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే.
- 'పొదెం'తోనే పార్టీకి శ్రీరామరక్ష.
- కాంగ్రెస్ కంచుకోట 'పొదెం'.
- పార్టీ అధిష్టానం ఆలోచించి నిర్ణయించాలి.
- చింతిరాల రవికుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
మార్చ్ 03,
కష్టకాలంలో కాంగ్రెస్ కు ప్రాణం పోసి, తెలంగాణలో కాంగ్రెస్ పునర్జీవానికి నాంది పలికి, కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచి, అసలు సిసలైన కాంగ్రెస్ వాది అంటే ఎలా ఉండాలో...? చూపించిన రాజకీయ దురంధరులు, కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ, గిరిజన నేత భద్రాచలం మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య గారికి తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాలని, తద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పార్టీ లో మనోధైర్యాన్ని కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిరాల రవికుమార్ డిమాండ్ చేశారు.
భద్రాచలంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని, పలుదపాలు ఎమ్మెల్యేగా చేసి, మచ్చలేని నేతగా, గిరిజన ప్రాంత ప్రజల ఆకాంక్షల కనుగుణంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ప్రగతికి 'పొదెం' చేసిన సేవలు మరువ లేనివన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వలవేసి, అనేకమందిని లాక్కొని పోయినా, పొదెంకు ఆ సమయంలో ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చినా...? హోదాలు, నగలు, వజ్ర వైడూర్యాలు, కోట్లాది రూపాయల నగదును తృణప్రాయంగా తోసిపుచ్ఛి రాజకీయ విలువలేంటో సమాజానికి చాటిన ఆదర్శ నేత 'పొదెం' అన్నారు.
గెలుపోటముల తో సంబంధం లేకుండా, కార్యకర్తల ను అంటిపెట్టుకొని, కాంగ్రెస్ తోనే నా జీవితం అంటూ ముందుకు సాగుతున్న...'పొదెం' లాంటి నికార్సైన కాంగ్రెస్ నేతను కాంగ్రెస్ అధిష్టానం తప్పకుండా గుర్తించాలని, ఎమ్మెల్సీ పదవితో గౌరవించాలని, కాంగ్రెస్ తీసుకునే ఈ చక్కని నిర్ణయం, అదే చక్కని సందేశంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తమ్మళ్ళ వెంకటేశ్వర్లు, శీలం రామ్మోహన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ చితిరాల సుధీర్,అసంబ్లీ ప్రెసిడెంట్ యడారి. ప్రదీప్, వాసిరెడ్డి.సాంబ శివరావు, కే. వరుణ్,శ్యామ్ రాంప్రసాద్, కొత్తగూడెం టీ.పి.సి.సి మెంబెర్ జె బి.శో్రి, ఓబీసీ జిల్లా చైర్మన్ అల్లడి నర్సింహారవు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు జె. రాజశేఖర్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీఖాన్, మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షులు గౌస్ మహానిద్ధిన్, చుంచుపల్లి మండల అధ్యక్షులు పౌల్, సుజాత నగర్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు