లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ బిల్ కలెక్టర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ బిల్ కలెక్టర్;
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ బిల్ కలెక్టర్
ఇంటి ఆస్తి పన్ను పెంచకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం డిమాండ్ చేసి బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఘటన రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం పరిధిలో కలకలం రేపింది.
ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో బిల్ కలెక్టర్ గా పని చేస్తున్న మధు, అతని ప్రైవేట్ అసిస్టెంట్ రమేష్ తో కలిసి మైలార్దేవుపల్లి జిహెచ్ఎంసి వార్డు కార్యాలయంలో ఓ కంపెనీకి సంబంధించిన యజమాని వద్ద రూ.45,000 లంచం తీసుకుంటూ రెడ్ అండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కాటేదాన్ పారిశ్రామిక అవార్డు లోని ఓ కంపెనీకి సంబంధించిన యజమాని వద్ద లంచం ఇవ్వకుంటే ప్రాపర్టీ టాక్స్ ఎక్కువ చేస్తామని బెదిరించి లక్ష రూపాయలు ఇవ్వాలని బిల్ కలెక్టర్ మధు డిమాండ్ చేశాడు.
తను అంత ఇచ్చుకోలేనని కంపెనీ యజమాని చెప్పి చివరకు రూ. 45 వేలకు బేరం కుదిరించుకొని, కంపెనీ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తనను లంచం ఇవ్వమని జిహెచ్ఎంసి బిల్ కలెక్టర్ మధు అతని అసిస్టెంట్ రమేష్ వేధిస్తున్నారని చెప్పడంతో,