మద్యం మత్తులో మహిళ హల్‌చల్...

మద్యం మత్తులో మహిళ హల్‌చల్...;

By :  Ck News Tv
Update: 2025-02-25 08:16 GMT

మద్యం మత్తులో మహిళ హల్‌చల్..


మూవీ ఆర్టిస్ట్ నడిరోడ్డుపై హోంగార్డుపై దాడి!

Social media : జూబ్లీహిల్స్: మందేసిన ఓ యువతి మందేసిన మైకంలో నడి రోడ్డుపై చిందులేసింది. తాగి ఊగి రోడ్డుపై తైతక్కలాడింది. మూవీ ఆర్టిస్టు మేకల సరిత మధురా నగర్‌లోని మెయిన్ రోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించింది.

మద్యం తలకెక్కిన మైకంలో చరణ్ అనే వ్యక్తిని దుర్బాషపడింది. అటుగా వెళ్ళేవారిని వదలకుండా విరుచుకుపడింది. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసుల విధులకు ఆటంకపర్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మూవీ ఆర్టిస్టు మధురానగర్‌లోని మెయిన్ రోడ్డుపై సోమవారం రాత్రి , మద్యం తాగి వస్తుండగా , విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు చెకింగ్ చేస్తుండగా రోడ్డు పైకి వచ్చి మద్యం మైకంలో చరణ్ అనే వ్యక్తిని దుర్బాషలాడింది.

అటుగా వెళ్ళేవారిని వదలకుండా బూతులతో విరుచుకుపడింది. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించింది.

అడ్డుకునేందుకు యత్నించిన మహిళ హోంగార్డుపై సైతం దాడి చేసింది. సరిత ప్రవర్తననతో పోలీసులు విసిగిపోయి.. ఆమె భర్తకు ఫోన్ చేసి పిలిపించారు. మద్యం మత్తులో వీరంగం చేస్తున్న ఆమెని ఇంటికి తీసుకెళ్ళాలని భర్త రాజేష్‌కు సూచించారు.

అనంతరం మధుర నగర్ పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసుకుని , దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో మహిళ చేసిన పనితో మధురా నగర్‌లో అందరూ షాక్ అయ్యారు. సరితకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Similar News