తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ స్థాపనకు కేంద్రం సహకరించాలి: ఎంపీ రఘురాంరెడ్డి
తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ స్థాపనకు కేంద్రం సహకరించాలి: ఎంపీ రఘురాంరెడ్డి;
తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ స్థాపనకు కేంద్రం సహకరించాలి
మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలతో ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు చేయూతనివ్వండి
377 నిబంధన కింద పార్లమెంట్ లో ప్రస్తావించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి
ఖమ్మం: తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్ డీసీ) స్థాపనకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి కోరారు. 377 నిబంధన కింద ఈ మేరకు బుధవారం లోక్ సభలో ప్రస్తావించారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రిని ఖమ్మం ఎంపీ కోరిన అంశాలు ఇలా..
తెలంగాణ ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక పోటీతత్వాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ డిజైన్ సెంటర్ నెలకొల్పాలని ప్రతిపాదిస్తోంది. సాంకేతిక పరంగా, హస్తకళలకు కేంద్రంగా తెలంగాణ అనువైన ప్రదేశం.
ఎన్ డీసీ ద్వారా పరిశ్రమలు, స్టార్టప్‌లు కళాకారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, మరియు పరిశోధన సేవలను అందించే అత్యాధునిక సదుపాయం లభిస్తుంది.
ఉత్పత్తి నాణ్యత మరియు మార్కెట్‌ను చేరుకోవడంలో సహాయపడటం దీని లక్ష్యం. తెలంగాణ యొక్క బలమైన చేనేత, వస్త్ర మరియు హస్తకళా సంప్రదాయాలు, పెరుగుతున్న ఐటీ రంగాలతో కలిపి, ఆధునిక నైపుణ్యాలకు వారధిగా, సరైన గమ్యస్థానంగా ఉంటుంది.
దీని ఏర్పాటుకు..అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
తెలంగాణలో ఎన్‌డీ సీ ని ఏర్పాటు చేయడం వల్ల మేక్ ఇన్ ఇండియా, మరియు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలతో ఆర్థిక వృద్ధి, ఉపాధిని పెంపొందించడానికి దోహదం చేస్తాయి అని.. పేర్కొంటూ.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పరిశీలించి..సానుకూల నిర్ణయం ప్రకటించాల్సిందిగా కోరారు.