నెమలి మాంసం విక్రయిస్తున్న పలువురిపై కేసు నమోదు

నెమలి మాంసం విక్రయిస్తున్న పలువురిపై కేసు నమోదు;

By :  Ck News Tv
Update: 2025-03-24 07:19 GMT

నెమలి మాంసం విక్రయిస్తున్న పలువురిపై కేసు నమోదు

కోళ్ళ బ్లడ్ ఫ్లూ వచ్చిందనుకున్నారో ఏమో కానీ,కొందరు కేటుగాళ్లు ఏకంగా నెమలి మాంసంపై కన్నేశారు.అది కాస్తా ఆనోటా ఈనోటా పోలీసులకు చేరడంతో నిందితుల గుట్టు రట్టయింది. వివరాల్లోకి వెళితే... నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వేములపల్లి మండలంలో నెమలి మాంసం విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు వేగంగా స్పందించి నెమలి మాంసంతో సహా నిందితున్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన ఆదివారం కలకలం రేపింది.

Full View

జాతీయ పక్షి మాంసాన్ని కుప్పలుగా వేసి ప్లాస్టిక్ కవర్ లో వాటాలుగా చేసి అమ్ముతున్న వ్యక్తిని వేములపల్లి పోలీసులు అదుపులో తీసుకుని, కేసు నమోదు చేసుకుని,ఎన్ని రోజులుగా నెమలి మాంసాన్ని అమ్ముతున్నారు?ఎంతమందికి ఇందులో ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.

Similar News