మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌కే లాభం.. కాదంటే పార్టీకే నష్టం : రాజగోపాల్ రెడ్డి
మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌కే లాభం.. కాదంటే పార్టీకే నష్టం : రాజగోపాల్ రెడ్డి;
మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌కే లాభం.. కాదంటే పార్టీకే నష్టం : రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
తనకు కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి కల్పించాలని నేరుగా డిమాండ్ చేయకుండా పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెట్టారు.
శుక్రవారం ఆయన మీడియాతో ఈ సందర్భంగా మంత్రి పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
'నాకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీకే లాభం. 2018లో నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే బీజేపీకి, ఆ తర్వాత బీజేపీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాలేదు.
నిద్రాహారాలు మాని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించా.
ఇప్పుడు మంత్రి పదవి కాంగ్రెస్ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం' అని పరోక్షంగా పార్టీని ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీలో కష్టపడి పనిచేసేవారికి తగిన గౌరవం అదే వస్తుందని అన్నారు.
నేడు అసెంబ్లీలో జరిగిన స్పీకర్- జగదీశ్ రెడ్డి అంశం పై స్పందిస్తూ.. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన స్థానం అని, దానిని ఎవరూ ప్రశ్నించలేరని పేర్కొన్నారు. జగదీష్ రెడ్డి స్పీకర్ చైర్ ను ప్రశ్నించడం సరికాదని, అతిగా ప్రవర్తించి.. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే సస్పెండ్ చేశారని వెల్లడించారు. తాము ఎవరినీ టార్గెట్ చేయబోమని, కాని తప్పు చేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు.