బండి సంజయ్‌కి BIG షాక్.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
బండి సంజయ్‌కి BIG షాక్.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు;
బండి సంజయ్‌కి BIG షాక్.. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ను పాకిస్తాన్ టీమ్ అనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తక్షణమే బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ మతాన్ని అడ్డుపెట్టుకొని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో సమాజంలో విభజన తేవాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఇంత దిగజారాలా? అని ఆది శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. తరచూ ఇలా గొప్పలు చెప్పుకోవడం కాదు..
దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక్క బీజేపీ నేతను చూపించండి అని సవాల్ చేశారు. దేశం కోసం సర్వం ధారపోసిన కాంగ్రెస్‌ను పాకిస్తాన్‌తో పోల్చడానికి సిగ్గుండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కాదని.. దమ్ముంటే మోడీని ఒప్పించి దేశంలో కులగణన చేయించాలని సూచించారు. బీజేపీ(BJP) బీసీ వ్యతిరేక పార్టీ అని అన్నారు. అంతకుముందు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ వెళ్లగానే సంజయ్ కార్పొరేటర్‌గా మారిపోతారని ఎద్దేవా చేశారు.
ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయాలని, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కి ఓటు వేయాలని కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం ఏంటని అన్నారు. అభివృద్ధి, నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడకుండా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు.
మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కరీంనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్‌తో పోల్చారు.
బీజేపీ ఇండియా టీమ్.. కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీమ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.