సంత్ సేవాలాల్ మహారాజ్ ఫోటో, దిమ్మెను తొలగించడం బాధాకరం

దోషులను వెంటనే శిక్షించాలి;

By :  Ck News Tv
Update: 2025-03-04 07:15 GMT

సంత్ సేవాలాల్ మహారాజ్ ఫోటో, దిమ్మెను తొలగించడం బాధాకరం

దోషులను వెంటనే శిక్షించాలి

మొన్న లోయపల్లి, ఈరోజు కారేపల్లి లో,

లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అజ్మీర సుశీల భాయ్

కారేపల్లి:

గిరిజన లంబాడాల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఫోటో, దిమ్మెను తొలగించడం బాధాకరం. దోషులను వెంటనే శిక్షించాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అజ్మీర సుశీల బాయి డిమాండ్ చేశారు. కారేపల్లి మండల కేంద్రంలో తీవ్ర అవమానం జరిగింది. ఇటీవల కారేపల్లి మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందుకుగాను పోలీస్ స్టేషన్ కి ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో సేవాలాల్ మహారాజు జయంతి వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో గిరిజన లంబాడ అంగరంగవైభవంగా జరుపుకున్నారు. అయితే వేడుకల నిర్వహణ దగ్గర నుండి గిరిజనులు ఏర్పాటు చేసిన సేవాలాల్ మహరాజ్ చిత్రపటం, గద్దెలను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో అక్కడే గిరిజనులు సీతాల భవనిలను ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించుకుంటు వస్తున్నారు. సోమవారం కొందరు స్థానిక వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు దగ్గర ఉండి ట్రాక్టర్ డోజర్ తో పూర్తిగా ధ్వంసం చేశారు. కనీసం సేవాలాల్ చిత్రపటాలను కూడా తీసి పక్కన పెట్టకుండా మూలన పడేయడంతో బంజారా జాతి దేవునికి తీవ్ర అవమానం జరిగింది. ఈ ఘటనపై లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం నాయకు రాలు అజ్మీర సుశీల బాయ్ తీవ్రంగా ఖండిస్తూ, విద్యాసానికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News